టీ టీడీపీ అధ్యక్షుడు రమణ హౌస్ అరెస్ట్...

Submitted by arun on Fri, 01/12/2018 - 11:36
ramana

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉండే మరో నేత మందాడి శ్రీనివాసరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో, ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీకి టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. వంటేరుపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. దీంతో, ఈ ర్యాలీని భగ్నం చేసే క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

English Title
tdp l ramana house arrest

MORE FROM AUTHOR

RELATED ARTICLES