వైసీపీకి షాకిచ్చిన చంద్రబాబు.. అవిశ్వాసంపై...

Submitted by arun on Fri, 03/16/2018 - 10:57
tdpysrcp

ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక పొలిట్ బ్యూరో సభ్యులతో తెదేపా అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సమాచారం పంపనున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఈ నాలుగేళ్లలో ఏం జరిగింది, ఎందుకు విడిపోతున్నాం వాస్తవ వివరాలతో లేఖ రూపొందించారు.

చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. అవిశ్వాసం నోటీస్ ఇవ్వాలని ఎంపీ తోట నర్సింహంకు ఆదేశాలు పంపారు. నిన్నటి వరకూ తమ అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆశించి.. మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవాలన్న వైసీపీ ఆశలపై తాజా నిర్ణయంతో చంద్రబాబు నీళ్లు చల్లారు. చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ డైలమాలో పడింది. వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని భావించే చంద్రబాబు మద్దతుపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. 
 

English Title
TDP to introduce no-confidence motion against Modi Govt

MORE FROM AUTHOR

RELATED ARTICLES