ఇద్దరి మ‌ధ్య పొత్తు షురూ..?

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:10
janasena

ఏపీ లో ఎన్నికల సందడి అప్పుడే మొదలయ్యిపోయింది..ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి..ఎన్ని సీట్లు అడగాలి ఇలా ఎవరి అంచానాలు వారికి ఉన్నాయి అయితే టిడిపి –జనసేన పొత్తు ఉంటుంది ముందు నుంచీ భావిస్తున్న తరుణంలో..ఇద్దరి పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి..అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపి ని ఈ సారి చంద్రబాబు దూరం పెట్టారనే చెప్పాలి…వచ్చే ఎన్నికల్లో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు..
అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు 45 నియోజక వర్గాలు టిడిపి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి ఈ సమయంలో టిడిపి పొత్తు తో మాత్రమే ఈ లోటుని భర్తీ చేసుకునే అవకాశం ఉంది..అందుకే జనసేనతో పొత్తు కి సిద్ద‌మ‌య్యారు చంద్రబాబు..జనసేన విషయంలో అయితే పార్టీ పెట్టి నాలుగేళ్ళు అవుతున్నా సరే గత ఏడాది ఎన్నికలకి దూరంగా ఉన్నా ఈ సారి మాత్రం ప్రత్యక్ష ఎన్నికలలోకి దూకడానికి సిద్దంగా ఉన్నారు..ఎందుకంటే..
పవన్ కి వ్యక్తిగత ఇమేజ్ తప్ప పార్టీ పరంగా ఉన్న ఇమేజ్ మాత్రం చాలా తక్కువ..గ్రామస్థాయిలో కూడా బలమైన కేడర్ లేదు అంచేత పొత్తుకి ఒకే చెప్పక తప్పదు అంటున్నారు..అయితే ప్రజాభిమానం మెండుగా ఉంది ఏపీ ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉన్న వారికే మద్దతు అంటూ చంద్రబాబు తో జట్టు కట్టడానికి సిద్ద పడ్డారు..ఇక సీట్ల విషయంలో చుస్తే ప్రధానంగా జనసేనకి చంద్రబాబు ఏపీ కి ఉన్న 13 జిల్లాలలో ఒక్కో జిల్లా నుంచీ ఇద్దరు చప్పున మొత్తం 26 సీట్లు జనసేనకి చంద్రబాబు కేటాయించనున్నారు అని తెలుస్తోంది..అయితే ఎంపీ సీట్ల విషయంలో సుమారు 5 సీట్లు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు..అయితే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని సరిగ్గా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబే చక్రం తిప్పుతారని తెలుస్తోంది.

English Title
tdp and janasena grand allianace in 2019election

MORE FROM AUTHOR

RELATED ARTICLES