కమలం ఎందుకు కమిలిపోతోంది... అసంతృప్తులు నీళ్లు చల్లారనా?

కమలం ఎందుకు కమిలిపోతోంది... అసంతృప్తులు నీళ్లు చల్లారనా?
x
Highlights

తెలంగాణ బిజేపి ఆశలపై ఇతర పార్టీల అసంతృప్తులు నీళ్లు చల్లారా.....? మొదటి నుంచి తమవైపు చాలా మంది వస్తరని ఆశించిన కమలం పార్టీ బంగపడిందా.....? చివరి వరకు...

తెలంగాణ బిజేపి ఆశలపై ఇతర పార్టీల అసంతృప్తులు నీళ్లు చల్లారా.....? మొదటి నుంచి తమవైపు చాలా మంది వస్తరని ఆశించిన కమలం పార్టీ బంగపడిందా.....? చివరి వరకు వస్తామని ఆశ చూపిన నేతలు సైతం వెనుకడుగు వేశారా.....? ఇతర పార్టీల అసంతృప్తుల కోసం కాషయపార్టీ లిస్టులను ఆలస్యం చేసినా ఎవ్వరూ రాకపోవడంతో పార్టీ నేతలు నిరాశ చెందారా.....? అవుననే అనిపిస్తుంది తాజ పరిణామాలు గమనిస్తే.

తెలంగాణ బిజేపి ఎన్నికలు ఆరు నెలల ముందునుంచే ఇతర పార్టీల అసంతృప్తిలపై కొండంత ఆశలు పెట్టుకుంది. తాము ఒంటరిగా పోటి చేస్తుండడంతో ఇతర పార్టీల అసమ్మత నేతలకు, తామే ప్రత్యామ్నాయమని భావించింది. కాంగ్రెస్ కూటమి కట్టడంతో కాంగ్రెస్ సీనియర్లకు సైతం సీట్లు సర్దుబాటు కాక, అందరూ తమైపు చూస్తారని అనుకున్నారు. కానీ బిజేపి గంపెడాశలపై ఇతర పార్టీల అసంతృప్తులు నీళ్లు చల్లారు. కేవలం టిఆర్ఎస్ టిక్కెట్టు ప్రకటించని ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు బాబు మోహన్, బొడిగే శోభలు తప్ప, మిగతా నేతలు కమలం పార్టీ వైపు కన్నెతి చూడలేదు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తన అభ్యర్దులను చివరి రోజువరకు ప్రకటించకుండా జాప్యం చేయడంతోనే, బిజేపి ఆశలపై నీళ్లు చల్లినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లిస్టు కోసం చాలా రోజులు ఎదురుచూసిన బిజేపి, ఎలాగొలా మొదటి లిస్టు విడుదల చేయాల్సి వచ్చింది. రెండో లిస్టు నాటికి కూడా కాంగ్రెస్ లిస్టు విడుదల కాకపోవడంతో, మరికొంతమంది పేర్లను ప్రకటించింది. అలా కాంగ్రెస్‌ లాస్ట్‌ లిస్ట్‌ వరకూ ఎదురు చూసి చూసి చివరికి భంగపడింది.

కాంగ్రెస్‌లో ఓ వర్గం బిజేపి వైపు వస్తుందని ప్రచారం జోరుగా జరిగింది. బిజేపి నేతలు అదే విషయాన్ని పార్టీ నేతలతో చెప్పుకున్నారు. కానీ ఏ వర్గమూ కూడా, కమలంవైపు చూడలేదు. ప్రారంభం నుంచి పార్టీ నేతలను విస్మరించిన జేజేపీ, చివరకు ఎవ్వరూ రాకపోవడంతో నిరుత్సాహపడింది. గత్యంతరంలేక, సొంతపార్టీనేతలకు టిక్కట్లు కేటాయించింది. అయిష్టంగా బీఫారాలు ఇచ్చిందని సొంత పార్టీపైనే ఫీలవుతున్న నేతలు, ప్రచారంలో తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీతో దోస్తి వదిలి ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి, ఇలా గెలుపు గుర్రాల కొరత వేధించింది. ఎన్నడూలేనంతగా, అన్నిచోట్లా అభ్యర్థులను ప్రకటించింది. ఎట్టకేలకు టికెట్‌ వచ్చిందని ఒకవైపు ఆశావహులు సంబరపడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు ఊహించని విధంగా బీఫారాలు ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారు. గత్యంతరంలేక ఇప్పటికైనా, పార్టీకి గుర్తొచ్చినందుకు సంతోషమని కార్యకర్తలు అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories