పెంపుడు తల్లి ఒడికి చిన్నారి తన్విత

x
Highlights

ఇల్లెందు చిన్నారి తన్విత వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. తన్వితను పెంపుడు తల్లికి అప్పగిస్తూ కొత్తగూడెం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది....

ఇల్లెందు చిన్నారి తన్విత వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. తన్వితను పెంపుడు తల్లికి అప్పగిస్తూ కొత్తగూడెం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత తన్విత తల్లి ఒడికి చేరింది.

160 రోజుల ఎడబాటు తర్వాత వెల్లివిరిసిన ఆనందమిది. మూడేళ్ళ తన్విత. ఆమెను పెంచిన తల్లి స్వరూప ఎదురుచూసిన సమయమిదే. ఇల్లెందు చిన్నారి తన్విత ఎట్టకేలకు పెంపుడు తల్లి దగ్గరకు చేరింది. పాపను పెంచిన తల్లి స్వరూపకు అప్పగించాలని కొత్తగూడెం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఖమ్మం ఐసీడీఎస్ అధికారులు తన్వితను తల్లికి అప్పగించారు.
తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు తన్వితను పెంచిన తల్లి స్వరూప దగ్గరే ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.

తన్విత కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి HMTV వరుస కథనాలు ప్రసారం చేసింది. అమ్మకు దూరమై తన్విత పడిన వేదనను HMTV ప్రజలకు తెలియచెప్పింది. తల్లుల వివాదానికి అభం శుభం తెలియని చిన్నారిని ఎందుకు బలి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ప్రేక్షకులతో పాటు , పలువురు తల్లుల మద్దతు కూడగట్టింది. అందరూ ఆకాంక్షించినట్లే తన్విత తాను ఎరిగిన తల్లి దగ్గరికే చేరింది. ‌తన్వితను తన దగ్గరికి చేర్చడంలో HMTV ఎంతో సాయపడిందని సంబర పడ్డారు..స్వరూప. చాలా కాలం తర్వాత అమ్మ ఒడికి చేరిన చేరి తన్విత... చెప్పలేని ఆనందంలో మునిగిసోయింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తన్విత కేసు సుఖాంతమవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories