కమల్‌ చిన్న కూతురు వ్యక్తిగత ఫోటోలు లీక్.. అతనికి సంబంధం..

Submitted by nanireddy on Fri, 11/16/2018 - 17:55
tanuj-virwani-spokesperson-akshara-haasan-photo-leak-case

సుప్రీంహీరో కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె, నటి అక్షరాహాసన్‌ కు సంబంధించిన కొన్ని పర్సనల్‌ ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనూజ్‌ విర్వానీతో గతంలో దిగిన ఫొటోలను ఆమె ఫోన్‌లోనుంచి గుర్తుతెలియని వ్యక్తి తస్కరించి ఇంటర్‌నెట్‌లోకి షేర్ చేశాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న అక్షర హతాశురాలైంది. వెంటనే ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా తనూజ్‌ని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే అక్షరాహాసన్‌ ఫోటోల లీక్ వ్యవహారం గురించి తెలుసుకున్న తనూజ్‌ మేనేజర్‌ స్పందించాడు. ఆ ఫొటోల లీక్‌తో తనూజ్‌కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించాడు. అక్షర పరువు బజారుకు ఈడ్చాలని చూసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, అందుకోసం తనూజ్‌ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపాడు. కాగా బాలీవుడ్‌ నటి రతి అగ్రిహోత్రి తనయుడు తనూజ్‌ విర్వానీ, అక్షర చాలా ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోయి స్నేహితులుగా మెలుగుతున్నారని తనూజ్ మేనేజర్‌ తెలిపాడు.

English Title
tanuj-virwani-spokesperson-akshara-haasan-photo-leak-case

MORE FROM AUTHOR

RELATED ARTICLES