హీరోయిన్ ఆత్మహత్య..

Submitted by nanireddy on Thu, 11/29/2018 - 21:06
tamil-tv-actress-hangs-herself-in-chennai-residence

సినీ నటి రియామిక్క చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్నీ ఆమె సోదరుడు వెల్లడించాడు. చెన్నై సమీపంలోని శ్రీదేవికి కుప్పానికి చెందిన రియామిక్క, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో నటన వైపు మళ్ళి హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో ‘కుండ్రాథిలే కుమరనుకు కొండట్టాం, అగోరి ఇన్ అట్టమ్ ఆరంభం’ వంటి చిత్రాలలో లీడ్ రోల్ పోషించింది.. తను అనుకున్న విధంగా కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో.. తీవ్ర ఒత్తిడికి లోనై, చెన్నైలోని తన ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం సాయంత్రం సోదరుడు ప్రకాశ్‌ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా ఆమె తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ప్రకాష్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English Title
tamil-tv-actress-hangs-herself-in-chennai-residence

MORE FROM AUTHOR

RELATED ARTICLES