ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని తండ్రిపై చిన్నారి ఫిర్యాదు

ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని తండ్రిపై చిన్నారి ఫిర్యాదు
x
Highlights

స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది అయితే నేటికీ మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్న...

స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది అయితే నేటికీ మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా రాజపురంకు చెందిన ఓ చిన్నారి మరుగుదొడ్డి కట్టించలేదని తన తండ్రిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. హనీఫా జరా అనే బాలికకు రెండేళ్ల క్రితం తన తండ్రి ఇసానుల్లా ఎల్‌కేజీలో క్లాస్ ఫస్ట్ వస్తే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని మాట ఇచ్చాడు.. అనట్లుగానే ఆమె ఫస్ట్ క్లాస్ లో ఫాస్ అయ్యింది అయినా నేటికీ మరుగుదొడ్డి కట్టించలేదని పీఎస్ లో కంప్లైంట్ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రామన్‌ వెంటనే చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆంబూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చభారత్‌ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించే పనులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు చిన్నారిని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories