సర్ ప్రైజ్... ఈ వారం తెలుగు బిగ్ బాస్ షోకి ఇద్దరు హోస్టులు

Submitted by arun on Thu, 08/02/2018 - 14:09
ttb

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్ -2 మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నాని తనదైన స్టైల్ లో  హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో నాని హౌస్ మెట్స్ తో సందడి చేస్తుంటారు. కాగా ఈ వారం నానితో పాటు.. మరో బిగ్ బాస్ హోస్ట్ కూడా సందడి చేయనున్నారు. ఆయనే యూనివర్సల్ స్టార్ కమలహాసన్. కమలహాసన్, ఇంట్లోని పోటీదారులతో కాసేపు గడపనున్నారు. తన నూతన చిత్రం 'విశ్వరూపం 2' ప్రమోషన్ లో భాగంగా ఆయన హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. యూనివర్సల్ స్టార్ గా, ఎన్నో తెలుగు హిట్ చిత్రాల్లో నటించిన కమల్ హౌస్ లో ఎలాంటి సందడి చేస్తారో వేచి చూడాల్సిందే. ఆయన రాక ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు.
 

English Title
Tamil Bigg Boss meets Telugu Bigg Boss!

MORE FROM AUTHOR

RELATED ARTICLES