తైవాన్ లో భారీ భూకంపం...

Submitted by arun on Wed, 02/07/2018 - 11:26
Taiwan earthquake

తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో రాత్రి 11:50 గంటల సమయంలోభారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలజికల్‌ సొసైటీ తెలిపింది. భారీ భూకంపం ధాటికి హువాలియెన్‌ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. వాటిల్లో వందలమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. భారీ భూకంపం తర్వాత 100సార్లకు పైగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ప్రాణభయంతో జనం రోడ్లపై పరుగులుతీశారు. 

ప్రఖ్యాత మార్షల్‌ హోటల్‌ భవనం కూలిపోయిన దృశ్యాలు అత్యంత భీతావహంగా ఉన్నాయి. భూకంప తీవ్రతకు ఓ హోటల్ కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల్లో సుమారు 50 మందికి పైగా ఉన్నట్టు స్థానిక మీడియా ప్రకటించింది. నివాస సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారని.. 210 మందికి పైగా గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు.  177 మంది గల్లంతయ్యారని తెలిసింది. భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 

English Title
Taiwan earthquake

MORE FROM AUTHOR

RELATED ARTICLES