సాహసం శ్వాసగా సాగిపో!

Submitted by arun on Wed, 11/28/2018 - 16:13
 Taanu Nenu Song

ఈ మద్య  ఎ ఆర్ రహమాన్ సంగీతం అందించిన పాట, అనంత శ్రీరామ్ రాసిన పాట ,  విజయ్ ప్రకాష్ పాడిన ... వినసొంపైన పాట.... సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోనో..... తాను ..నేను..
తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మాను
దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరై పోనీ పుడమి మన్ను
నేను తాను రెప్ప కన్ను
వేరై పోనీ పుడమి మన్ను
తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం
తాను నేను మోయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగె దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను
మనసు మేను మనసు మేను
మనసు మేను మనసు మేను
వింటుంటే...ఎంతో ప్రశాంతంగా ..మధురంగా వినిపించే..అనిపించే పాట. శ్రీ.కో.

English Title
Taanu Nenu Song With Lyrics

MORE FROM AUTHOR

RELATED ARTICLES