ఈ కటౌట్ కి విలువ లేదా?

x
Highlights

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మోడీని అడిగేశారు కడిగేశారు దేశం యావత్తూ ఆయన విశ్వరూపాన్ని చూసి అచ్చెరువొందింది. ఆ ఆవేశం, ఆ వేడి ఆ తపన చూసిన...

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మోడీని అడిగేశారు కడిగేశారు దేశం యావత్తూ ఆయన విశ్వరూపాన్ని చూసి అచ్చెరువొందింది. ఆ ఆవేశం, ఆ వేడి ఆ తపన చూసిన వారికి కాంగ్రెస్ దిశ, దశ ఖచ్చితంగా ఏదో నాటికి మార్చగలరన్న నమ్మకం కలిగింది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఆ నమ్మకం కలగడం లేదా? అందుకే నూరేళ్ల పార్టీ చుక్కాని అలా ఫేడ్ అవుట్ అయిపోతున్నా పట్టించుకోడం లేదా?

శత వసంతాల చరిత్ర అని గొప్పగా చెప్పుకుంటారు మా తాతలు నేతులు తాగారంటూ హడావుడి చేస్తారు ఏ చిన్న విషయం మాట్లాడినా మేమూ మా పార్టీ మా చరిత్రఅంటూ గొప్పలు చెప్పుకుంటారు కానీ పార్టీ అధ్యక్షుడికే అవమానం జరిగితే మాత్రం పట్టించుకోరా? తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

అదో పెద్ద భవనం పేరు గాంధీ భవన్ ఉమ్మడి రాష్ట్రంలో ఈ భవనం తీరే వేరు దీనికుండే కళే వేరు రాష్ట్రం విడిపోయాక అది తెలంగాణ కాంగ్రెస్ కి భవనంగా మారింది. కానీ దాని బాగోగులు మాత్రం నేతలు పట్టించుకోవడం లేదు కార్యాలయం ముందు పార్టీ అధ్యక్షుడి నిలువెత్తు కటౌట్ చిరిగిపోయి, విరిగిపోయి అంద విహీనంగా కనిపిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం పట్టటం లేదు ఆఫీస్ లో పెద్దనేతలెవరూ లేరేమో అనుకుంటే పొరపాటు.. పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే కాదు.. ఎఐసిసి ఇంచార్జులు కుంతియా, కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్ ఇలా అందరూ గాంధీ భవన్ లోనే ఉన్నారు రాబోయే ఎన్నికలకోసం ప్రచార వ్యూహరచన చేస్తున్నారు వారంతా ఆ చిరిగిన కటౌట్ ముందునుంచే అటూ ఇటూ తిరుగుతున్నారు తప్పితే.. తమ పార్టీ అధ్యక్షుడి కి జరుగుతున్న అవమానాన్ని మాత్రం పట్టించుకోడం లేదు.

ఇక సోనియమ్మ, రాహుల్ గాంధీల కోసం ప్రాణాలిస్తాననే నేతలు సైతం ఈ చిరిగిన కటౌట్ ను పట్టించుకోడం లేదు. ఉదయం లేస్తే ఓట్లు, సీట్లు అంటూ గాంధీ భవన్ లో కూర్చునే కాంగ్రెస్ నేతలు భవనం ముందున్న కటౌట్ దుస్థితినే పట్టించుకోలేక పోతే ఇక ప్రజల దుస్థితినేం పట్టించుకుంటారు?

Show Full Article
Print Article
Next Story
More Stories