స్వైన్ ఫ్లూ లక్షణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Highlights

స్వైన్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుంజా మహమ్మారి. తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే...

స్వైన్ ఫ్లూ అనేది ఒక ఇన్ఫ్లుంజా మహమ్మారి. తెల్ల పందిలో దాగి ఉండే స్వైన్‌ఫ్లూ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్‌ఫ్లూయెంజ విభాగానికి చెందిన వైరస్‌తో వ్యాప్తి చెందే జలుబు. ఈ రకమైన వైరస్ తరచూ తనలో ఉన్న జన్యువులను ఇతర వైరస్‌లతో మార్చుకోవడంతో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొచ్చి ఫ్లూ జ్వరం కలుగజేస్తుంటాయి. హెచ్1ఎన్1 వైరస్ కలిగిన రెండు ప్రమాదకరమైన వ్యాధిల్లో ఒకటి. మొట్టమొదటి సారిగా మనిషిలో ఈ వ్యాధిని కనుగొన్నారు. 2009న దక్షిణ కేలిఫోర్నియాలో మరియు సేన్ ఏంటోనియా, టెక్సాస్ దగ్గర తొలిసారిగా( హెచ్1 ఎన్1(స్వైన్ ఫ్లూ) )ను కనుగొన్నారు. ఈ వైరస్ ద్వారా మనుషుల ద్వారా వచ్చే అంటువ్యాధి అని గుర్తించారు.
వృద్దులకు దూరంగా స్వైన్ ఫ్లూ
విలక్షణమైన లక్షణం స్వైన్ ఫ్లూ సొంతం. చిన్నపిల్లలు, 60ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారే లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తుంది. దీంతో శ్వాస ఆడకపోవడం, జ్వరం,దగ్గు,గొంతు నొప్పి,ఒంటి నొప్పులు,తల నొప్పి,చలి మరియు అయాసం వస్తుంది. గతంలో ఈ లక్షణాలు ఉన్నవారికి మరణించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.
స్వైన్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది
స్వైన్ ఫ్లూ అనేది హెచ్1ఎన్1 వైరస్ కలిగిన రెండు ప్రమాదకరమైన వ్యాధిల్లో ఒకటి. ఈ వ్యాది లక్షణాలు ఉన్న వ్యక్తికి వారం రోజుల పాటు ఇబ్బందిపెడుతుంది. ఆ తరువాత చికిత్స చేసే కొద్ది తగ్గి పోతుంది. అయితే వ్యాధి తగ్గకపోతే ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కాబట్టి ఏ చిన్న జ్వరమొచ్చిన తక్షణమే వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది.
చిన్నపిల్లలో ఉండే స్వైన్ ఫ్లూ లక్షణాలు
శ్వాస ఆడకపోవడం
చర్మం రంగు మారిపోతుంది. చర్మం ఎలాంటి రంగును కలిగినా స్వైన్ ఫ్లూ సోకితే నీలిరంగుకి మారిపోతుంది.
ఆహారం తీసుకోలేకపోవడం
మాట్లాడక లేక పోవడం
చిరాకుగా ఉండడం
జ్వరం,దగ్గు రావడం
పొక్కులతో జ్వరం
పెద్దవారిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం
గుండెల్లో నొప్పి..పొత్తి కడుపులో నొప్పి, ఒత్తిడి
తలతిరగడం, తిక్కతిక్కగా ఉండడం
నిరంతరాయం వాంతులు రావడం. ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్ ఫ్లూ అనడానికి వీలులేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదు.
మూతికి మాస్క్, బట్ట ధరించాలి.
చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి వ్యాధి వేగంగా సోకే అవకాశముంటుంది.
మధుమేహం, క్యాన్సర్, వృద్ధులు, పిల్లలు, గర్బిణులకు, శ్వాసకు సంబంధించి వ్యాధి ఉన్న వారికి, స్టెరాయిడ్స్ వాడే వారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories