సిరివెన్నెల సీతారామశాస్త్రి కి నంది బహుమతి తెచ్చిన పాట

Submitted by arun on Fri, 11/30/2018 - 15:20
 Andela Ravali Song

అందెల రవమిది పదములదా అనే ఈ పాట 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, సంగీతం అందించింది ఇళయరాజా.
||శ్లోకం||
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుద్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ||2||
తస్మై శ్రీ గురవే నమః
|అతడు| ఓం నమో నమో నమశ్శివాయ
|ఆమె| మంగళ ప్రదాయ గోపురంగతే నమశ్శివాయ
గంగయాతరింగితోత్తమాంగతే నమశ్శివాయ
|అతడు| ఓం నమో నమో నమశ్శివాయ
|ఆమె| శూలినే నమో నమః కపాలినే నమశ్శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమశ్శివాయ
పల్లవి:
|ఆమె| అందెల రవమిది పదములదా ||2||
అంబరమంటిన హృదయముదా ||అందెల||
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా
|అతడు| సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ||అందెల||
చరణం 1:
|ఆమె| మువ్వలు ఉరుముల సవ్వడులై - మెలికలు మెరుపుల మెలకువలై ||2||
మేను హర్షవర్ష మేఘమై - వేణి విసురు వాయువేగమై
|అతడు| అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై
లాస్యం సాగే లీల… రసఝరులు జాలువారేలా
|ఆమె| జంగమమై జడమాడదా
|అతడు| జలపాత గీతముల తోడుగా
|ఇద్దరు| పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా ||అందెల||
చరణం 2:
|అతడు| నయనతేజమే “న” కారమై
మనోనిశ్చయం “మ”కారమై
శ్వాసచలనమే “శి”కారమై
వాంఛితార్థమే “వ”కారమై
యోచన సకలము “య”కారమై
నాదం “న”కారం, మంత్రం “మ”కారం
స్తోత్రం “శి”కారం, వేదం “వ”కారం
యజ్ఞం “య”కారం, ఓం నమఃశివాయ
|ఆమె| భావమే భవునకు భావ్యము కాదా
భరతమే నిరతము భాగ్యము కాదా
|అతడు| తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ
|ఆమె| ప్రాణపంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించదా
|అతడు| ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా || అందెల ||

ఇప్పటివరకు వినకుంటే ఒక సారి వినండి ..సీతా రామశాస్త్రి గారి...బాషాపై పట్టు ఈ పాటలో తెలుస్తుంది. శ్రీ.కో.

English Title
Swarna Kamalam Movie Andela Ravali Song

MORE FROM AUTHOR

RELATED ARTICLES