హెడ్‌ఫోన్ విసిరితే నా కంటికి తాకింది: స్వామిగౌడ్

Submitted by arun on Mon, 03/12/2018 - 12:26
Swamy Goud

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్ ఫోన్స్‌ను విసిరారు. మైక్ గాంధీ ఫోటోను తాకి స్వామి గౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను వెంటనే కంటి ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వామిగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సభ్యులు విసిరిన మైక్‌ నేరుగా తన కంటికి తగిలిందని తెలిపారు. బాధ కలుగుతున్నప్పటికీ ఓర్చుకుంటూ గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యేవరకు ఓర్చుకున్నానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సూచన మేరకు సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో కాస్త జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరిరకైనా తమ నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. అయితే ఇలాంటి చర్యలు మాత్రం సరికాదని స్వామిగౌడ్‌ అన్నారు.

English Title
swamy goud says about head phone attack incident

MORE FROM AUTHOR

RELATED ARTICLES