బీజేపీలో చేరనున్న పరిపూర్ణానందస్వామి

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 15:32
swami paripoornanandha will be join in bjp

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైన అయన ఈ సాయంత్రం ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి... బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన పరిపూర్ణానంద... ఈసారి అమిత్‌షాతోపాటు ప్రధాని నరేంద్రమోడీని కూడా కలుస్తారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో పరిపూర్ణానందకు కీలక బాధ‌్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రచార సారధిగా పరిపూర్ణానందను నియమిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థిగా నియమించే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది.

English Title
swami paripoornanandha will be join in bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES