లోక్‌సభలో 4 పార్టీల అవిశ్వాసం తీర్మానం..స్పీకర్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

లోక్‌సభలో 4 పార్టీల అవిశ్వాసం తీర్మానం..స్పీకర్‌ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
x
Highlights

అవిశ్వాసం ఎపిసోడ్ హస్తినలో హైటెన్షన్‌ క్రియేట్ చేస్తోంది. నిన్న మొన్నటివరకు టీడీపీ, వైసీపీ మాత్రమే అవి‌శ్వాస అస్త్రం ప్రయోగించగా...ఆ జాబితాలో తొలుత...

అవిశ్వాసం ఎపిసోడ్ హస్తినలో హైటెన్షన్‌ క్రియేట్ చేస్తోంది. నిన్న మొన్నటివరకు టీడీపీ, వైసీపీ మాత్రమే అవి‌శ్వాస అస్త్రం ప్రయోగించగా...ఆ జాబితాలో తొలుత కాంగ్రెస్.. ఆ తర్వాత సీపీఎం , ఆరెస్పీ చేరాయి. శుక్రవారం సభ వాయిదా పడగానే టీడీపీ, వైసీపీతో పాటు...కాంగ్రెస్ కూడా అవి‌శ్వాస తీర్మానం నోటీసులిచ్చింది. ఇక సీపీఎం, ఆఎస్పీ నిన్న సాయంత్రం అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని లోక్‌సభ సెక్రటరీ జనరల్ కు అందచేశాయి. మొత్తంగా ఐదు పార్టీల నుంచి ఏడు అవి‌శ్వాస తీర్మానం నోటీసులు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అందాయి.

కాంగ్రెస్ పార్టీ స్వయంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం పరిస్థితి బీజేపీ మిగతా విపక్షాల మధ్య పోరాటంగా మారింది. కొద్ది రోజులుగా టీఆర్ఎస్, అన్నాడీఎంకే చేస్తున్న ఆందోళనల్ని సాకుగా చూపించి టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ బుట్ట దాఖలు చేస్తూ వచ్చారు. టీడీపీ, వైసీపీ ఆరుసార్లు అవి‌శ్వాసం నోటీసులు ఇవ్వగా...సభ ఆర్డర్‌లో లేదనే సాకుతో చర్చకు అనుమతించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ , సీపిఎం, ఆరెస్పీ విడివిడిగా అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో కనీస మద్దతు సంఖ్యాబలంపై స్పష్టత వచ్చినట్లయ్యింది. అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొద్ది రోజులుగా లోక్‌సభ వెల్‌లో ఆందోళనలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ తన వైఖరి మార్చుకుంది. అవిశ్వాసాన్ని అడ్డుకోరాదని నిర్ణయించుకుంది. స్పీకర్ అవిశ్వాసం ప్రకటనను చదివే సమయంలో ఆందోళనలు చేయవద్దని గులాబీ బాస్ ఆదేశించారు. దీంతో ఇవాల్టి నుంచి లోక్ సభలో ఇతర విపక్షాలకు టీఆర్ఎస్ సహకారం అందబోతోంది. అటుకొద్ది రోజులుగా అవి‌శ్వాసానికి అడ్డుగా నిలుస్తున్న అన్నాడీఎంకే మాత్రం ఆందోళపలు కోనసాగిస్తాని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అవి‌శ్వాస తీర్మానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు... అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ భయపడుతోందన్న విమర్శలు నేపధ్యంలో కమలనాథుల్లో పునరాలోచన మొదలైనట్లు సమాచారం. ప్రత్యేక హోదా , విఝబన హామీల అమలు, ఏపీకి నిధుల విడుదల వంటి అంశాలపై విపక్షాల విమర్శలకు సభలోనే సమాధాన యోచిస్తున్నారు. దీంతో ఇవాళ అవిశ్వాస తీర్మానాలను అడ్మిట్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా అవి‌శ్వాసం కథ క్లైమాక్స్‌కి చేరినట్లే కనిపిస్తోంది. అవిశ్వాసంపై ఇవాళో రేపో చర్చ చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories