శరత్‌‌ను చంపిన దుండగుడి కాల్చివేత

శరత్‌‌ను చంపిన దుండగుడి కాల్చివేత
x
Highlights

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో తెలంగాణ విద్యార్థిని శరత్‌‌ను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. కేన్సస్‌లో...

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో తెలంగాణ విద్యార్థిని శరత్‌‌ను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు కాల్చి చంపేశారు. కేన్సస్‌లో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పట్టుకునేందుకు అమెరికా పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందగా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని వైద్యులు ప్రకటించారు. నిందితుడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం జల్లెడపట్టారు. ఈ క్రమంలో దుండగుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దాంతో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో దుండుగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే దుండగుడి వివరాలను పోలీసులు ఇంకా బయటపెట్టలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories