బీజేపీకి ఊహించని షాక్‌ ...తాజా సర్వేతో మోడీ, అమిత్ షాల్లో కలవరం

బీజేపీకి ఊహించని షాక్‌ ...తాజా సర్వేతో మోడీ, అమిత్ షాల్లో కలవరం
x
Highlights

వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరాభవం తప్పదా ? నాలుగేళ్ల కమలదళం పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారా ? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో గ్రాఫ్‌ పెరిగిందని బీజేపీ...

వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరాభవం తప్పదా ? నాలుగేళ్ల కమలదళం పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారా ? ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో గ్రాఫ్‌ పెరిగిందని బీజేపీ నేతలంటుంటే....సర్వేలు ఏం చెబుతున్నాయ్ ? 2014 ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన కాషాయ దళానికి ఓటర్లు షాకివ్వనున్నారా ? 150 సీట్లు కూడా గెల్చుకోలేని స్థితికి పార్టీ దిగజారిపోయిందా ? ఇటీవల నిర్వహించిన సర్వేలో ఏం తేలింది.

2019 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయముంది. రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు బీజేపీ నేతలు సైతం...మళ్లీ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి...రెండోసారి అధికారం కలేనని తేలింది. గత ఎన్నికల్లో 282 స్థానాల్లో సొంతంగా గెలుపొందిన బీజేపీ...ఈ సారి 130 సీట్లకు పరిమితమవుతుందని పార్టీ అంతర్గత సర్వే తేలింది. దీంతో ప్రధాని మోడీతో పాటు అధ్యక్షుడు అమిత్‌ షాల్లో కలవరం మొదలైంది.

బీజేపీ సిట్టింగ్‌ స్థానాల్లో ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత ఉందని...బీజేపీ నేతలు భావిస్తున్నారు. స్టిట్టింగ్‌ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో యువతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ, షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పుంజుకోవాలంటే యువతరానికి చట్టసభల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలని సంఘ్‌ పరివార్‌ పెద్దలు సూచించినట్లు సమాచారం. 75 ఏళ్లు నిండిన సీనియర్లకు...ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే పార్టీ సీనియర్లు అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, కల్‌రాజ్‌ మిశ్రా వంటి నేతలకు మళ్లీ ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో చేసిన ప్రయోగాన్ని... దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో upలో 71 సీట్లలో గెలుపొందిన బీజేపీకి...ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలో తేలింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత ఎక్కువ ఉండటంతో...ఇతర రాష్ట్రాలపై నేతలు దృష్టి సారించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ల్లో ఎక్కువ సీట్లు సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్క సీటు కూడా గెలుపొందే అవకాశాలు లేవని సర్వేలో తేలింది. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని...ఒడిషాలోని పూరీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాని పూరి నుంచి పోటీ చేస్తే...ఒడిషాతో పాటు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ సీట్లు సాధించవచ్చని కమలదళం భావిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో 48, రాజస్థాన్‌లో 13, మధ్యప్రదేశ్‌లో 16, మహారాష్ట్రలో17, బిహార్‌లో 12, జార్ఖండ్‌లో 5, హరియాణాలో 7, ఉత్తరాఖండ్‌లో 3, చండీఘడ్‌లో 1, ఇతర రాష్ట్రాల్లో 28 సీట్లలో ఓటమి పాలవుతుందని సర్వేలో తేలింది. సర్వేలు బీజేపీకి ఊహించని షాక్‌ ఇవ్వడంతో....పార్టీ అగ్రనేతలు ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories