ఫ్యాన్స్‌ కాళ్లకు నమస్కరించిన సూర్య

Submitted by arun on Thu, 01/11/2018 - 17:24
surya

అభిమానుల‌ను ఆద‌రించ‌డంలో త‌మిళ హీరోలు మిగ‌తా భాష‌ల సినీ హీరోల‌తో పోల్చితే ఒక అడుగు ముందే ఉంటారు. అభిమానం త‌ట్టుకోలేక ఒక్క‌సారిగా త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన వారిని చిరాకు ప‌డ‌కుండా ప్రేమ‌గా ఆద‌రిస్తుంటారు. విక్ర‌మ్ ఓ అభిమానిని కౌగిలించుకోవ‌డం, అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు న‌టుడు కార్తీ హాజ‌రై ఏడ‌వ‌డం ఇలా చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల సూర్య కొత్త చిత్రం 'గ్యాంగ్‌' త‌మిళ ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం‘గ్యాంగ్‌’. కీర్తి సురేశ్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. సూర్య స్టేజ్‌పైకి రాగానే అభిమానులు ఒక్కసారిగా స్టేజ్‌పైకి వెళ్లి సూర్య కాళ్లకు నమస్కరించారు. దాంతో కాస్త ఇబ్బంది పడిన సూర్య వెంటనే వారి కాళ్లకు నమస్కరించారు. ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించడం చూసి అక్కడి వారు షాకయ్యారు.
 

English Title
suriya falls at fans feet

MORE FROM AUTHOR

RELATED ARTICLES