నేరం రుజువైతే ఈయనకూ అదే శిక్ష...?

Submitted by arun on Mon, 09/17/2018 - 11:41
Pranay's murder case

ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ భార్య అమృత డిమాండ్ చేస్తుంది. క్యాస్టిజం మీద పోరాటం సాగిస్తానని, అందరూ తనకు మద్దతునివ్వాలని అమృత కోరుతోంది. మా డాడీ కనిపిస్తే నేనే చంపేస్తానని చెబుతోంది అమృత. పోలీసులు మొదటి నుంచి తమకు సపోర్టు చేశారని, 10, 11 రోజుల్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది. పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని, ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది.  హింసాత్మక చర్యలకు పాల్పడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని విచారణ కోర్టులు, హైకోర్టులు పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగానే పరిగణించాలని, దోషులకు ఉరిశిక్ష విధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీలో షియా వర్గానికి చెందిన యువతి సున్నీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడ్ని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసును విచారించిన ఢిల్లీ కోర్టు దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికీ 2011లో ఉరిశిక్ష విధించింది.

English Title
supreme court on murder of dignity act

MORE FROM AUTHOR

RELATED ARTICLES