భారత న్యాయవ్యవస్థలో కలకలం..మీడియా ముందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల

Submitted by arun on Fri, 01/12/2018 - 14:13
Supreme Court Judges, addressing the media

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి నలుగురు సీనియర్ జడ్జిలు తిరుబాటు బావుటా ఎగరేశారు. నేరుగా ప్రధాన న్యాయమూర్తిపైనే విమర్శలు చేశారు. జాస్తి చలమేశ్వర్‌తో పాటు మురో ముగ్గురు న్యాయమూర్తులు అనూహ్యంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై విమర్శలు గుప్పించారు. భారత దేశ చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఊహించని విధంగా నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం కలకలం రేపుతోంది. 

జాస్తి చలమేశ్వర్‌ నివాసంలో నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు మంతనాలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టులో అవాంఛనీయ పరిణామాలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో జరగకూడని పరిణామాలు జరుగుతున్నాయని జాస్తి చలమేశ్వర్
 అన్నారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఎవరి మాటా వినడం లేదని ఆరోపించారు. దీపక్ మిశ్రా తీరు వల్ల న్యాయవ్యవస్థకు చేటు జరిగే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు..ప్రస్తుతం దేశానికి స్వతంత్రంగ్యా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమని అభిప్రాయపడ్డారు. 
 
న్యాయవ్యవస్థలో పారదర్శకత కోసం తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చలమేశ్వర్
 వివరించారు.  సమస్యల్ని పరిష్కరించమని ప్రధాన న్యాయమూర్తిని అడిగామనీ...అయినా పట్టించుకోలేదని తెలిపారు. తప్పనిపరి పరిస్థితుల్లోనే మీడియా ముందుకు వచ్చామన్నారు. సుప్రీంకోర్టు పవిత్రత నిలబడకపోతే ప్రజాస్వామ్యానికి చేటన్న చలమేశ్వర్...జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
 

English Title
Supreme Court Judges, addressing the media in New Delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES