సుప్రీంకోర్టుకు చేరిన రాఫెల్ ఢీల్ వివాదం

Submitted by arun on Mon, 10/08/2018 - 14:53
 Rafale Deal

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య రగులుతున్న వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 10న వీటిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పందం తాలూకు వివరాలతో పాటు ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాల ఒప్పందాల మధ్య ధరల వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్‌లో ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని లాయర్ వివేక్ ధండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫ్రాన్స్‌ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు కూడా వెల్లడించాలని ఆయన కోరారు. రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నయంటూ మరో న్యాయవాది ఎమ్ఎల్ శర్మ ఇంతకు ముందే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని 253 అధికరణాన్ని ఈ ఒప్పందం ఉల్లంఘిస్తోందనీ... ‘‘అవినీతిమయమైన’’ రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
 

English Title
Supreme Court To Hear Petition Against Rafale Deal On October 10

MORE FROM AUTHOR

RELATED ARTICLES