పద్మావత్‌ సినిమా రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌

Submitted by arun on Thu, 01/18/2018 - 12:27
Padmaavat

సంజయ్‌ లీలా భన్సాలీ పద్మావత్‌ మూవీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ విడుదలపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేసింది. దాంతో నిషేధం విధించిన నాలుగు రాష్ట్రాల్లో పద్మావత్‌ రిలీజ్‌కు లైన్‌క్లియరైంది. అన్ని రాష్ట్రాలతోపాటు హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోనూ పద్మావత్‌ విడుదల కానుంది. సెన్సార్‌ సమస్యలను దాటి ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతున్న క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్‌ బోర్డ్‌ రిలీజ్ కు అనుమతించినా.. తాము మాత్రం అనుమతించబోమని ఆయా ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. దీంతో నిషేదంపై చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కారణంగా సినిమాను నిషేదించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాపై విధించిన నిషేదాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ సుప్రీం తీర‍్పుతో ఈ నెల 25న దేశవ్యాప్తంగా పద్మావత్‌ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

English Title
Supreme Court has cleared the way for the release of ‘Padmaavat’

MORE FROM AUTHOR

RELATED ARTICLES