భార్య గురించి తప్పుడు సమాచారమిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే!

Submitted by arun on Wed, 03/21/2018 - 15:56
Peddireddi

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించి పూర్తి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. 

వివరాల్లోకి వెళ్తే, 2014 ఎన్నికల సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తప్పులతడకగా ఉందంటూ పుంగనూరు టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజు హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ లో తన భార్యను ఒక చోట గృహిణిగా, మరోచోట కంపెనీ ఎండీగా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను కూడా అందించారు. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. పిటిషనర్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని... పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. 

English Title
Supreme Court gives shock to YCP MLA Peddireddi

MORE FROM AUTHOR

RELATED ARTICLES