ముందుంది.. రజనీకాంత్ అసలు స్కెచ్!

Submitted by arun on Fri, 03/09/2018 - 15:28
rajini

తమిళనాడులో మక్కల్ నీది మయ్యం అంటూ పార్టీ పెట్టి జనాల్లోకి దూసుకుపోతున్నారు.. కమల్ హసన్. అధికారమే ధ్యేయంగా ఆయన అన్ని ఎత్తులూ వేస్తున్నారు. ఇదే సమయంలో.. కమల్ కంటే రాజకీయాల్లో ప్రవేశంపై ముందే క్లారిటీ ఇచ్చి.. ఇప్పటికీ పార్టీ పెట్టకుండా సమయాన్ని గడిపేస్తున్నారు.. రజనీకాంత్. ఓ వైపు కమల్ జనాల్లోకి వెళ్తుంటే.. ఇటు రజనీ మాత్రం ఎందుకిలా చేస్తున్నారన్న చర్చ.. సర్వత్రా జరుగుతుతోంది.

రాజకీయ వర్గాలు.. రజనీ అభిమాన వర్గాల్లో మాత్రం.. ఈ చర్చకు ఓ సమాధానం దొరుకుతోంది. నా దారి.. రహదారి.. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.. అని ఎప్పుడూ చెప్పే రజనీ.. ఆ డైలాగ్ కు అనుగుణంగానే సంచలన రీతిలో జనాల్లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన మొబైల్ యాప్ తో పాటు.. తన అనుచర వర్గంగా కనీసం కోటి మందిని భాగస్వామ్యం చేసుకోవాలని.. ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ చర్య విజయవంతం అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఓట్లను ముందే సాధించినట్టుగా రజనీ ఆలోచిస్తూ ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవ రూపం దాలిస్తే.. కమల్ కంటే.. రజనీ మరింత ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే.. అనుచరులు కోటి మంది ఉన్నపుడు.. అందులో 70 శాతం ఓట్లుగా మలుచుకోగలిగినా.. సగం విజయం సాధించినట్టే.

అదీ కాక.. జనం నుంచి తన పాపులారిటీతో ఓట్లు సాధించడం కూడా రజనీకి పెద్ద కష్టమైన పని కాదు. అందుకే.. ముందు ఈ ఆలోచనను అమల్లో పెట్టి.. తర్వాత.. జనాల్లో వెళ్తే బాగుంటుందని రజనీ అండ్ కో ఆలోచిస్తున్నారట.

English Title
Superstar Rajini is now just Rajinikanth, the people's leader

MORE FROM AUTHOR

RELATED ARTICLES