ఆర్మీ క్యాంపుపై దాడి...ముగ్గురు జవాన్లు వీరమరణం

Submitted by arun on Sat, 02/10/2018 - 11:41
terror attack

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు...సున్‌జ్వాన్‌ ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. గాయపడ్డ మరో ఐదుగురిని....చికిత్స కోసం హెలికాప్టర్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఉగ్రదాడిపై జమ్మూ కశ్మీర్‌ డీజీపీ...హోం మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించారు. 

నలుగురు ఉగ్రవాదులు సున్‌జ్వాన్‌ ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయ్. ఆర్మీ ప్రత్యేక దళాలతో పాటు స్పెషల్ ఆపరేషన్‌ గ్రూప్‌ రంగంలోకి దిగింది.  అంతేకాకుండా ఉగ్రవాదుల కదలికలను కనుగొనేందుకు డ్రోన్‌లు, హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. 

English Title
Sunjwan army camp terror attack

MORE FROM AUTHOR

RELATED ARTICLES