సునంద పుష్కర్ మృతి కేసులో చార్జ్ షీట్ దాఖలు

Submitted by santosh on Mon, 05/14/2018 - 16:46
sunanda pushkar case

సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, మాజీ కేంద్ర మంత్రి  శశిథరూర్‌పై చార్జి షీట్ దాఖలైంది. ఢిల్లీలోని పాటియాలా కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 306, 498ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునందా పుష్కర్ మృతి కేసు విచారణను ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని శశిథరూర్‌పై ఛార్జిషీట్‌లో ఆరోపించారు. 

2014, జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లోని తన గదిలో సునంద పుష్కర్ శవమై పడి ఉండగా గుర్తించారు. ఆమె మృతికి విష ప్రయోగం, మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం కారణమని తదితర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే, సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని చార్జిషీట్ లో పోలీసులు శశి థరూర్ పై ఆరోపణ నమోదు చేయడంతో  ఆమె ఆత్మహత్య చేసుకుందని దాదాపు నిర్ధారణ అయ్యింది.
 

English Title
sunanda pushkar case

MORE FROM AUTHOR

RELATED ARTICLES