కమలానికి ఊహించని షాక్‌..కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌

Submitted by chandram on Thu, 11/29/2018 - 12:47
cong

అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో రోజులు కూడా లేవు.. రోజులు దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీలో, అభ్యర్థుల్లో, ప్రజల్లో ఇలా అందరిలోనూ తీవ్ర ఉత్కంఠత రేపుతుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. చాలా కాలంపాటు బీజేపీలో కలిసి సేవలు అందించిన తాజా మాజీ స్పీకర్ సుమిత్రా సింగ్ ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరారు. రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో సచిన్‌ పైలట్‌, మాజీ సిఎం అశోక్‌ గెహ్లోత్‌, అవినాశ్‌ పాండే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

కాగా సుమిత్రా సింగ్ అసెంబ్లీకి తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. 2003 సంవత్సరంలో బీజేపీ ఘన విజయం సాధించిన తరువాత 12వ శాసనసభకు సుమిత్రా పదవి భాద్యతలు చేపట్టారు. కాగా 2013 శాసనసభ ఎన్నికల్లో సుమిత్రాసింగ్‌కు బీజీపీ అధిష్ఠనం టికెట్ ఇవ్వకపోవడంతో లాభంలేదని సుమిత్రాసింగ్ ఏకంగా రెబల్ గా పోటీ బరిలో దిగారు. దింతో బీజేపీ అధిష్ఠానం పట్టుబట్టి పార్టీ నుండి బహిష్కరించారు. దింతో సుమిత్రా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. సుమిత్రా మాట్లాడుతూ కేవలం బీజేపీని ఓడించాడానికే కాంగ్రెస్ తీర్థంపుచ్చుకున్నట్లు వెల్లడించింది.   

English Title
Sumitra Singh joins Congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES