సుక్కూ.. దేవీ కాంబో.. మళ్లీ సూపర్ హిట్

x
Highlights

సుకుమార్ సినిమాలంటే.. దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ఊపున్న పాటలిస్తాడో.. అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మాటను మరోసారి నిజం చేశాడు దేవీ. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న...

సుకుమార్ సినిమాలంటే.. దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ఊపున్న పాటలిస్తాడో.. అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మాటను మరోసారి నిజం చేశాడు దేవీ. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా మొదటి పాట ఎంత సక్కంగున్నవే ఎంతటి సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో.. రంగా రంగా రంగస్థలాన పాట కూడా వచ్చేసింది.

1984 నాటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో.. రెండో పాట కూడా.. అదే తీరుగా పిక్చరైజ్ చేశారు. వినిపించేటట్టు కాదురా.. కనిపించేటట్టు కొట్టండి అంటూ.. రామ్ చరణ్ చెప్పడం.. అతని క్యారెక్టర్ గురించి మరోసారి హింట్ ఇచ్చినట్టయింది. సినిమాలో జాతర సీన్ సందర్భంగా ఈ పాటను పెట్టినట్టుగా కనిపిస్తోంది.

రామ్ చరణ్ స్టెప్పులు హైలైట్ అవడం ఖాయమని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. మంచి ట్యూన్ కు తగిన బీట్.. సరిగ్గా సరిపోయిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో.. రంగస్థలం సినిమా మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories