‘రంగస్థలం’ క్లైమాక్స్‌ వివాదం.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్‌

‘రంగస్థలం’ క్లైమాక్స్‌ వివాదం.. క్లారిటీ ఇచ్చిన సుకుమార్‌
x
Highlights

రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా...

రామ్ చరణ్ హీరోగా తాను రూపొందించిన 'రంగస్థలం' చిత్రంపై నెలకొన్న కాపీ వివాదం దర్శకుడు సుకుమార్ స్పందించారు. ఈ కథను ఎక్కడి నుండి కాపీ కొట్టలేదని, సొంతగా తాను రాసుకున్నదే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌కు ఆరు పేజీల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ నేతృత్వంలోని సంఘం..... సుకుమార్ వివరణతో ఏకీభవిస్తూ అధికారిక నోటీసు జారీ చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఫిర్యాదుదారు, సినీ రచయిత యం. గాంధీకి సూచించింది.

రంగస్థలం కాన్సెప్ట్‌ తనదేనంటూ,తన కథను కాపీ కొట్టారంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుకుమార్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా రచయితలగా సంఘం కోరగా... తాను గానీ , తన బృందంలోని సభ్యులు గానీ గాంధీ అనే వ్యక్తిని అసలు కలుసుకోలేదనీ చెప్పాడు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారనీ, ఆ లైన్‌తోనే తాను క్లైమాక్స్‌ను రాసుకున్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు ధర్మ యుద్దం సినిమా చూసినప్పటి నుంచీ తనలో ఆ పాయింట్‌ గుర్తుండిపోయిందనీ, అంతేకాకుండా సిడ్నీ షెల్డన్‌ రాసిన ఎ స్ట్రేంజర్‌ ఇన్‌ ది మిర్రర్‌, బాలీవుడ్‌ మూవీ అంజామ్‌లో కూడా ఇదే లైన్‌ ఉంటుందనీ వివరించారు. అయితే తాను ఎంచుకున్న ఈ లైన్‌కు తనదైన పద్దతిలో కథ, కథనాన్ని రచించానంటూ వివరణ ఇచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories