అరుణ్ జైట్లీ - సుజ‌నా చౌద‌రి భేటీలో నిజం లేదంట‌

అరుణ్ జైట్లీ - సుజ‌నా చౌద‌రి భేటీలో నిజం లేదంట‌
x
Highlights

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టీని ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి క‌ల‌వ‌లేదంటూ సీఎం ర‌మేష్ వివ‌రణిచ్చారు. జైట్లీ - సుజ‌నా క‌లిశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో...

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టీని ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి క‌ల‌వ‌లేదంటూ సీఎం ర‌మేష్ వివ‌రణిచ్చారు. జైట్లీ - సుజ‌నా క‌లిశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు.
దిగ‌జారుడు రాజ‌కీయానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తుందంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ఓ వైపు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఏపీలో ఒక‌లా, పార్ల‌మెంట్ లో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌నిపించేలా టీడీపీ - బీజేపీతో లాలూచి ప‌డిన‌ట్లు స‌మాచారం.
ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు. హ‌స్తిన‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు టీడీపీ నేత‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆ టెలీ కాన్ఫ‌రెన్స్ లో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ నుంచి విడిపోయి ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం ఫైట్ చేస్తున్న టీడీపీ ర‌హ‌స్యంగా బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.
ఏపీ టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తో ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లు టెలీ కాన్ఫ‌రెన్స్ లో య‌న‌మ‌ల బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. దీంతో టీడీపీ రాజ‌కీయం ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది.

భేటీ విషయాన్ని యనమల ప్రస్తావించినా సుజనా భేటీ విషయాన్ని అంగీకరించారు. అయితే వివరాల విషయంలో పెద్దగా స్పందించలేదని సమాచారం. దాంతో ఈ విషయమై పార్టీలోని నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. జైట్లీతో సుజనా భేటీ కావటం చంద్రబాబుకు తెలీకుండా జరగదని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తరపున సుజనా కేంద్రమంత్రిని కలిసుండచ్చని కూడా అనుమానిస్తున్నారు. సరే, విషయం ఏదైనా కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నది ఎవరన్న విషయం ఈరోజు టెలికాన్ఫరెన్సులో బయటపడింది.
ఈ నేప‌థ్యంలో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలువలేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. అదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రమేష్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న ఎన్డీఏ అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ అడ్డుకుంటుంద‌ని అన్నారు.
ఇన్నీ రోజులు క‌న‌ప‌డ‌ని టీడీపీ అవినీతి ఇప్పుడెలా క‌నిపిస్తోంద‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు అన్నారు. నిధుల, పోలవరం ప్రాజెక్టు విషయాల్లో కేంద్రం అన్యాయం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. విభజన తప్పు తెలుసుకుని అవిశ్వాసానికి కాంగ్రెసు మద్దతు ఇస్తోందని మాగంటి బాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories