చిక్కుల్లో పడిపోయిన సుజనా చౌదరి

Submitted by arun on Fri, 03/09/2018 - 15:07
Sujana

మారిషస్ బ్యాంకుకు అప్పులు ఎగ్గొట్టారని చాలా కాలంగా కేంద్రంలో తాజా మాజీ మంత్రి సుజనాచౌదరి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర మంత్రి అవడం కంటే ముందు.. ఈ విషయంలో కాస్త లీగల్ సమస్యలను కూడా సుజనా ఎదుర్కొన్నారు. తర్వాత.. చంద్రబాబు చొరవతో.. కేంద్రంలో మంత్రి అయ్యారు. అప్పటి నుంచి.. సుజనా చౌదరి ఇప్పటివరకూ చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు.

కానీ.. ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సహాయం విషయంలో గొడవతో.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కేంద్ర మంత్రి పదవిని సుజనా చౌదరి పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీగా మిగిలిపోయారు. దీంతో.. కేంద్రం ఇప్పుడు ఏం చేయబోతోంది? సుజనా పాత కేసులను మళ్లీ తోడే అవకాశం ఉందా? ఆయనపై వచ్చిన లీగల్ ఇష్యూలను లేవనెత్తబోతోందా?

ఒక లాలూ ప్రసాద్ యాదవ్.. ఒక చిదంబరం.. తర్వాత ఇప్పుడు ఒక సుజనా చౌదరి అనం మనం వినాల్సిన పరిస్థితి రాబోతోందా? కేంద్రం తీరు, బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే.. ఇది జరిగేలాగా కనిపిస్తోంది. కానీ.. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో.. కేంద్రం అంతకు తెగిస్తుందా.. సుజనాను చిక్కుల్లోకి నెట్టి విమర్శలు కొనితెచ్చుకుంటుందా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

English Title
Sujana Chowdary Mauritius Bank case may come forward

MORE FROM AUTHOR

RELATED ARTICLES