విజ‌య్ సాయిరెడ్డి పీఎంవోలో తిరిగితే త‌ప్పేంటీ

Submitted by lakshman on Fri, 03/23/2018 - 14:59
sudhish rambhotla fire on chandrababu and shivaji

ఆపరేషన్ గరుడ, ద్రవిడ అంతా అబద్ధమని, అదంతా ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బిజెపి అదికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల హీరో శివాజీ ఆరోపణలను కొట్టి పారేశారు. కారెం శివాజీ లాగా ఈ శివాజీ కూడా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన అన్నారు.
 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. బిజెపిని తిడతారని అనుకుని పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతల జనాన్ని తరించారని, అయితే అక్కడ సీన్ రివర్స్ అయిందని అన్నారు.
 అలా తిరిగితే తప్పేమిటి... కుట్ర అనే పదాన్ని ఇటీవల టిడిపి నేతలు ఎక్కువగా వాడుతున్నారని, విజయసాయి రెడ్డి పార్లమెంటు సభ్యుడని, ఆయన పిఎంవోలో తిరిగితే తప్పేమిటని రాంభొట్ల అన్నారు. బిజెపి పవన్ ఆడిస్తోదందనీ జగన్‌తో కుమ్మక్కయిందనీ టిడిపి నేతలు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. 
దాన్ని చంద్రబాబు తిరస్కరించారు...
 ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికి కూడా తిరస్కరించలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఆ రాష్ట్రాలకు కేవలం ప్రత్యేకంగా నిధులు మాత్రమే ఇచ్చారని, నీతి అయోగ్ ప్రతిపాదనలతోనే అలా ఇచ్చారని ఆయన వివరించారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులున్నారని, చంద్రబాబును కూడా అందులో ఉండాలని కోరితే తిరస్కరించారని ఆయన చెప్పారు.
 బాబు కోరుకోలేదు..
. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం గానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో కోరుకోలేదని సుధీష్ రాంభొట్ల అన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఎపికి కేంద్రం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కర్ణాటకకు నిధులు ఎక్కువ ఇస్తున్నామనే మాటలో నిజం లేదని అన్నారు.
 చంద్రబాబు కాదు, బిజెపి... ఇందిరా గాంధీని ఎదుర్కొంది చంద్రబాబు కాదని.. బిజెపి అని, ఆ విషయాన్ని టిడిపి నేతలు గుర్తు పెట్టుకోవాలని సుధీష్ రాంభొట్ల అన్నారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ అడిగితే చదర్బాబు ఇవ్వలేదనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే గానీ అవినీతి జరిగిందని అన్నారు.
 

English Title
sudhish rambhotla fire on chandrababu and shivaji

MORE FROM AUTHOR

RELATED ARTICLES