ఖర్మ కాలిపోవచ్చు.. టైమ్ బ్యాడ్ కావచ్చు..

x
Highlights

ఖర్మ కాలిపోవచ్చు.. లేక టైమ్ బ్యాడ్ కావచ్చు.. ఏదేమైనా.. మన తప్పు లేకున్నా కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితాలనే తారుమారు చేసే విషయం...

ఖర్మ కాలిపోవచ్చు.. లేక టైమ్ బ్యాడ్ కావచ్చు.. ఏదేమైనా.. మన తప్పు లేకున్నా కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితాలనే తారుమారు చేసే విషయం పక్కనే ఉన్నా.. తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొంపలు మునిగేవే కాదు.. ఏకంగా ప్రాణాలే తీసే అనూహ్య పరిణామాలను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సంఘటనలను చూస్తేనే.. ఒళ్లు వణుకుపడుతుంది. మరి ఆ సమయంలో మనముంటే..?

ప్రమాదం ఎటునుంచైనా పొంచి ఉండొచ్చు. ఎప్పుడు ఏ సమయంలో మృత్యువు పట్టుకువెళ్తుందో చెప్పలేం. అప్పటివరకు సాఫీగా సాగిన ప్రయాణం.. ఒక్కసారిగా దారి మళ్లుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిన వాహనాలు.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుంటే.. ఓ కంటైనర్ మాత్రం వారి జీవితాలకే రెడ్ సిగ్నల్ వేసింది. పొరబాటు మనం చేయాల్సిన పనిలేదు. పక్కవాడు చేసినా.. దాని తాలూకు వాటా మనం పంచుకోవాల్సి వస్తుంది. మినిమం రూల్స్ తెలియని డ్రైవర్లు.. రోడ్డుపై వాహనాలను ఇష్టానుసారం నడుపుతారు. వారి పొరబాటుతో పక్కవారి ప్రాణాలను తీస్తారు.

క్షణకాలం ముందు ప్రమాదం పొంచి ఉందని మనకు సంకేతాలు కనిపించినా.. ఒక్కోసారి దాని బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తన్న ఓ ముసలి వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది. కానీ తృటిలో ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. ఒక్కోసారి మన ప్రయాణమే మృత్యు ముఖంలోకి వెళ్తుంది. ఎంత కంట్రోల్‌గా వెళ్లినా.. ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించినా.. జరగాల్సింది జరిగిందనే లెవెల్లో ప్రమాదాలు ఎదురవుతాయి. అలాంటి సమయాల్లో బ్రేకులేసినా బండి మాత్రం ఆగదు.

స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్ అని కొటేషన్స్ మనకు బోలెడు కనిపిస్తాయి. కానీ రోడ్డు సాఫీగా ఉంటే.. ఎక్స్‌లేటర్‌ పై ఉన్న మన చేయి లేదా కాలు ఊరుకుంటుందా..? ఆ సమయంలో బ్రేకులున్న విషయమే మనకు గుర్తుకురాదు. ఓ హైవేలో జరిగిన ప్రమాదం.. స్పీడ్ కంట్రోల్‌ ను గుర్తు చేస్తుంది. అతివేగం ప్రాణం తీస్తుందని.. మరోసారి రుజువు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories