ఎంపీ వినోద్‌ని నిలదీసిన యువకుడు

Highlights

కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ వినోద్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ పట్టణంలోని లైబ్రరీలో ఫ్రీ వైఫై సేవలను...

కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ వినోద్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ పట్టణంలోని లైబ్రరీలో ఫ్రీ వైఫై సేవలను ఎంపీ వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు చదువుకునేందుకు వీలుగ లైబ్రరీలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. లైబ్రరీలో నిరుద్యోగులు కాంపీటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతుంటే అక్కడే ఉన్న ఓ యువకుడు లైబ్రీ ఉంది కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడంటూ ఎంపీని నిలదీశారు. కొలువుల క్యాలెండర్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా చేయనిది ఇప్పుడెలా ఇస్తారని యోగి అనే యువకుడు ప్రశ్నించాడు.

యువకుడు యోగి నుంచి ఊహించని రీతిలో ఎదురైన ప్రశ్నకు ఎంపీ కూడా తడబడ్డారు. అయితే ప్రభుత్వం అందరికి ఉద్యోగాలు కల్పించలేదని ఉద్యోగలు ఇవ్వలేం వ్యవసాయం పై కూడా నిరుద్యోగులు దృష్టి పెట్టాలన్నారు. ఇంతకాలం ఎదురు చూసింది ఉద్యోగం కోసమేనని వ్యవసాయం కోసం కాదని యువకుడు ఎంపీతో అన్నారు. కొత్త గా ఏర్పడిన రాష్ట్రం కావడంతో విభజన ప్రక్రియకే ఏడాది పట్టిందని యువకుడి మాటలతో తాను ఏకీభవిస్తానని ఎంపీ అన్నారు. తెలంగాణ ప్రస్తుతం పురిటి నొప్పులు అనుభవిస్తోందని త్వరలో పారదర్శకంగా నియమకాలు జరుగుతాయని చెప్పి ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories