కశ్మీర్‌లో స్తంభించిన జనజీవనం...

Submitted by chandram on Thu, 11/22/2018 - 17:43
jammu

హురియత్ నేత హఫీజుల్లా మిర్ హత్యకు నిరసనగా నేడు కశ్మీర్ లోయలో  బంద్ చేపట్టారు. ఈ సమ్మెతో జనజీవనం అస్తవస్థంగా మారింది. నేటి బంద్‌తో పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, బస్సులు, కిరాణ దుఖణాలు ఎక్కిడిక్కడ బంద్ చేపట్టారు. బంద్ తో ప్రజలు నానాఇక్కట్లు పడ్డారు. సర్కారు బస్సులను రోడ్లపై తిరగనివ్వకపోవడంతో ప్రయాణీకులకు తప్పని తిప్పలు. నిన్నటి వరకు కశ్మీర్ ప్రశాంతంగా ఉండి నేటి బంద్ ఒక్కసారిగా హిట్ ఎక్కింది. విద్యార్థులు, పిల్లలు, ఉద్యోగస్తులు, మహిళలలు ఇంటికే పరిమితం కావల్సివచ్చింది. కొద్దిమంది మాత్రం అత్యవసర నిమిత్తం ఆటో, రిక్షాలనే ప్రయాణం చేయాల్సివచ్చింది. వేర్పాటు వాదులు ఆందోళనతో మరిన్ని జిల్లాలో కూడా ప్రజలు తీవ్ర ఎదుర్కుంటున్న దుస్థితితో చాలా మంది నుండి ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వేర్పాటువాదులు సయీద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మలిక్ సారథ్యంలో నడుస్తున్న జాయింట్ రెసిస్టెన్స్ లీడర్‌షిప్ (జేఆర్ఎల్) నేడు సమ్మె నిర్వహించారు.  

English Title
Strike disrupts normal life in Kashmir

MORE FROM AUTHOR

RELATED ARTICLES