స్ట్రీట్‌ ఫైట్‌..ఇద్దరు టెన్త్‌ విద్యార్ధుల మధ్య ఘర్షణ

Submitted by arun on Wed, 01/17/2018 - 14:20

హైదరాబాద్‌ నాచారంలో ఇద్దరు టెన్త్‌ విద్యార్ధులు స్ట్రీట్‌ ఫైట్‌కి దిగారు. వీరారెడ్డినగర్‌లో పదో తరగతి చదువుతోన్న అరవింద్‌, సాయినాథ్‌ మధ్య ఏర్పడిన చిన్నపాటి ఘర్షణ... చివరికి కత్తిపోట్లకు దారితీసింది. అరవింద్‌పై సాయినాథ్‌ కత్తితో దాడి చేశాడు. అరవింద్‌కి తీవ్ర గాయాలు కావడంతో నాచారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

నాచారం సెయింట్‌ మాథ్యూస్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న సాయినాథ్‌, అరవింద్‌ ఇద్దరూ స్నేహితులుగా తెలుస్తోంది. సంక్రాంతి సెలవులు కావడంతో అరవింద్‌ సాయినాథ్ ఇంటికి వచ్చాడు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. చివరికి అది కత్తిపోట్ల వరకూ వెళ్లింది. సహనం కోల్పోయిన సాయినాథ్‌ ఒక్కసారిగా అరవింద్‌పై కత్తితో దాడి చేశాడు. అరవింద్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సాయినాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే తన చెల్లెల్లి వేధించొద్దన్నందుకే అరవింద్‌పై సాయినాథ్‌ కత్తితో దాడి చేశాడని బాధితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. సాయినాథ్‌ వేధిస్తున్నాడని చెల్లెలు చెప్పడంతోనే అరవింద్‌ నిలదీశాడని చెప్పారు. ఇద్దరూ మంచి స్నేహితులేనని, కానీ సాయినాథ్‌ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదంటున్నారు. అరవింద్‌ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. 

English Title
Street Fight

MORE FROM AUTHOR

RELATED ARTICLES