కర్ణాటకలో వింత శిశువు జననం

Submitted by nanireddy on Wed, 10/03/2018 - 16:11
strange-baby-born-karnataka

కర్ణాటకకు చెందిన ఓ మహిళ వింత శిశువుకు జన్మించింది, అయితే కానీ వెనుక తోక ఆకారంలో జన్మించిన ఆ వింత శిశువు జన్మించిన కొద్దిసేపటికే కన్నుమూసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా సోమవారపేటకు చెందిన భవననిర్మాణ కార్మికుడు జీకే మూర్తి భార్య చిన్నమ్మకు సోమవారం రాత్రి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువుకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం పుట్టింది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు లేవని వైద్యులు తెలిపారు. కాగా జన్మించిన కొద్దిసేపటికే ఆ శిశువు మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ తరహా వింత శిశువు జన్మించడం ఇదేం కొత్త కాదని జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తారని వైద్యనిపుణులు అంటున్నారు.
 

English Title
strange-baby-born-karnataka

MORE FROM AUTHOR

RELATED ARTICLES