వైరలవుతోన్న వజ్రాల విమానం..!?

Submitted by chandram on Fri, 12/07/2018 - 19:37
Emirates

గత రెండ్రోరోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఇప్పుడు ఆ ఫోటో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. అందరి చూపు అటువైపే నెటిజన్లును విపరితంగా ఆకట్టుకుంటుంది. అయితే అందరూ దినిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇది నిజామా కాదా? ఇంత భారీ ఖరీదైన విమానమా అంటూ ప్రతిఒక్కరు లైలామాలో పడిపోయారు. అసలు సంగతి ఎంటి అంటే వేల వజ్రాల వెలుగుతో దగదగ మేరిసిపోతుంది. ఐయితే ఇది వజ్రాలతో తయారుచేసిన విమానమా అని అనే అనుమానం అందరికి వచ్చింది. కానీ ఇది నిజమైన విమానం కాదని కేవలం ఫోటో మాత్రమేనని ఆ సంస్థ వెల్లడించింది. దింతో నెటిజన్లు ఊపిరిపిల్చుకున్నారు. విమానం ఫోటోను పోస్ట్‌ చేస్తూ ‘‘బ్లింగ్‌’ 777 ఇమేజ్‌ క్రియేటెడ్‌ బై సారా షకీల్‌’ అంటూ ఎమిరేట్స్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కేవలం ఫోటో మాత్రమే అని ఎమిరేట్సే స్వయంగా ప్రకటించింది. ప్రముఖ క్రిస్టల్‌ ఆర్టిస్ట్‌ అయిన సారా షకీల్‌ రూపొందించిదని, ఇది నిజం కాదు’ అంటూ సదరు అధికారి  మీడియాకు స్పష్టం చేశారు.

 

 

English Title
The story behind the ‘diamond studded’ Emirates plane’s viral photo

MORE FROM AUTHOR

RELATED ARTICLES