ఉత్తర కొరియా ధైర్యం

ఉత్తర కొరియా ధైర్యం
x
Highlights

అమెరికాకు తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జపాన్లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర...

అమెరికాకు తాజా క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జపాన్లోని హొక్కాయిడో ద్వీపం మీదుగా వారం రోజుల్లోనే రెండోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించి ప్రపంచ దేశాలకు మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సవాల్ విసిరారు. తాము ఏకంగా హైడ్రోజన్ బాంబునే పరీక్షించామని చెప్పి ప్రపంచ దేశాలకు పెనుసవాల్ విసిరిన కిమ్ సరిగ్గా వారం తిరక్కుండానే మరో ఖండాంతర క్షిపణి ప్రయోగిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోమని తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. అసలు కిమ్ జాంగ్ ఉన్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? అణ్వస్త్ర అగ్ర దేశాలు కిమ్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? నిజంగా కిమ్ భావిస్తున్నట్లు ఈదేశాలు కాగితపు పులులేనా? ఉత్తర కొరియాపై అమెరికా మండిపడుతోంది. ఎన్ని ఆంక్షలు విధించినా క్షిపణి ప్రయోగా లు ఆపకపోవడం అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఇప్పటి వరకు మాటలు, హెచ్చరికలకే పరిమితమైంది.. అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా, జపాన్ ఒక్కటైతే కిమ్‌జాంగ్ ఉన్ను సప్త సముద్రాల నీళ్లు తాగించవచ్చన్న అంతర్జాతీయ నిపుణుల అంచనాలు తప్పా? మరి కిమ్ ధైర్యం, ధీమా ఏమిటి? ఎప్పటీకీ ఈ దేశాలు తమకు వ్యతిరేకంగా ఒకటికావనా? చైనా, రష్యా.. కలిసిరా వడం కష్టమే.. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ధీమా ఒక్కటే. అమెరికా, చైనా, రష్యాలు ఎప్పుడూ.. ఏ విషయంలోనూ కలవవు.

ఉత్తర కొరియాపై యుద్ధం చేయడానికి చైనా, రష్యాలు పూర్తిగా వ్యతిరేకం. అందుకనే మొన్ననే జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా ఈ రెండు దేశాధినేతలు ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను సామరస్య చర్యల ద్వారా, ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా యుద్ధానికి కాలుదువ్వరాదంటూ ఈ రెండు దేశాలు హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేయడం వల్ల ఉత్తర కొరియాకు మాత్రమే కాదు, అటు అమెరికాకు కూడా నష్టదాయకమే. ఎందుకంటే, అమెరికాకు చెందిన రెండున్నర కోట్ల మంది ప్రజలు ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణులు లక్ష్యం పరిధిలో ఉన్నారు. మరో లక్ష మంది అమెరికన్లు ఏకంగా ఉత్తర కొరియాలోనే ఉన్నారు. పరిస్థితి విషమించి ఒకవేళ యుద్ధమే గనుక సంభవిస్తే.. ఉత్తర కొరియాలో ఉన్న అమెరికన్ల పరిస్థితి ఎలా ఉంటుంది? వారి ప్రాణాలకు రక్షణ ఉండదేమో అన్నది అమెరికా భయం. మరోవైపు ఉత్తరకొరియా, అమెరికాల నడుమ యుద్ధమే జరిగితే అమెరికా కన్నా ఉత్తరకొరియాకే అనుకూలత ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే భౌగోళికంగా అమెరికా కన్నా ఉత్తర కొరియాకే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.

ఉత్తరకొరియాపై నేరుగా దాడి జరిపే కంటే.. ఆంక్షలు విధించడం ద్వారా దానిని తమ అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్య సమితి ద్వారా మరిన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఉత్తర కొరియాను అదుపు చేయాలనేది అమెరికాతోపాటు దక్షిణకొరియా, జపాన్‌వ్యూహం. ఇప్పటికే కొరియాపై బొగ్గు, కొన్ని రకాల ఖనిజాలపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాలపై ఆంక్షలు విధించాలన్నది ఈ మూడు దేశాల డిమాండ్. నిజానికి కిమ్ జాంగ్ ఉన్ ఇటీవలి కాలంలో ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏమిటంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర పాటవం కలిగిన దేశంగా యావత్ ప్రపంచం గుర్తించాలి. అప్పుడే కిమ్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన ఆ దేశమూ చేరుతుంది. అదీ అసలు సీక్రెట్. అందుకే ఉత్తరకొరియా అధినేత శరవేగంగా తన ఆయుధ సంపత్తిని,ప్రయోగ పాటవాన్ని పెంపొందించుకునేందుకు సీక్రెట్‌గా పావులు కదుపుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా మిలిటరీ శక్తి స్థాయికి తనదేశ మిలిటరీ శక్తిని చేర్చడానికి ఉవ్విళ్లూరు తున్నారు. ఏదో ఒకరోజు కిమ్ జాంగ్ ఆ పని చేసి తీరుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories