డొనాల్డ్ ట్రంప్ ఎంత‌టి శృంగార‌పురుషుడంటే

Submitted by lakshman on Wed, 03/14/2018 - 14:02
Stormy Daniels’ friend describes listening in on the porn star’s phone calls with Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్..వారితో శారీరక సంబంధాల్ని కొన‌సాగించేవాడు. అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్ట‌క‌ముందు ప‌లువురు స్త్రీల‌తో శారీర‌క సంబంధాన్ని నెరిపిన ట్రంప్ ఆ త‌రువాత అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ..తాను స‌న్నిహింతంగా ఉన్న మ‌హిళ‌లంద‌రిని దూరం చేశాడు. ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెల‌వ‌గా..ఇప్పుడిప్పుడే  ఇత‌ర స్త్రీల‌తో నెరిపిన అక్ర‌మ‌సంబంధాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. 
 గతంలో  ట్రంప్ ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్‌. అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్‌ స్టార్‌. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన ప్రేమాయణం కొనసాగించారు. కాలిఫోర్నియాలో 2006లో లేక్‌ తహో గెస్ట్‌హౌస్‌ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే! ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. 
తన లాయర్‌ మైఖేల్‌ కోహెన్‌ ద్వారా లక్షా 30 వేల డాలర్లు (దాదాపు 83లక్షల రూపాయలు) ఆమెకు పంపి- ‘మన బంధంపై నోరెత్తవద్దు’ అని కోరారు. స్టెఫానీ ఆయన చెప్పినట్లే ఆయనతో సెక్స్‌ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్‌ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 
ఆ త‌రువాత కొద్దిరోజుల‌కి  ట్రంప్ పోర్న్ స్టార్ స్టామీ డానియోల్ తో శారీర‌క సంబంధాన్ని కొన‌సాగించాడు. ఆ సంబంధాలు బ‌య‌ట‌కు పొక్క‌కుండా స్టామీకి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు ముట్ట‌జెప్పార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే వార్త‌ల్ని వైట్ హౌస్ వ‌ర్గాలు ఖంఢించాయి. ఈ నేప‌థ్యంలో  స్టామీ డానియోల్ ఫ్రెండ్ , ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ కెయిత్ మున్యాన్ ట్రంప్ శృంగార ర‌హస్యాల్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. ఓ టీవీ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన కెయిత్ ట్రంప్ - స్టామీల బంధం ఎలాంటిదో చెప్పాడు. 
తాను లాస్ ఎంజెల్స్‌లోని లోయ ప్రాంతంలో డానియెల్  తో క‌లిసి రెండేళ్ళపాటు ఉన్నానని మున్యాన్ చెప్పారు. అదే స‌మ‌యంలో 2006లో ట్రంప్‌ తొలిసారిగా డానియెల్‌తో మాట్లాడాడని ఆయన చెప్పారు. ట్రంప్ మాట‌లు చాలా విచిత్రంగా ఉండేవ‌ని ..శారీర‌క సంబంధాన్ని నెరిపేందుకు ఉత్స‌హం చూపించిన ట్రంప్ డానియోల్ కి ఫోన్ చేసి అప్పుడప్పుడు త‌న ప్ర‌ప్రోజ్ ను ముందుంచే వాడ‌ని , కానీ డానియోల్ అందుకు ఒప్పుకునేది కాదు. చివ‌రికి  అయితే చివరికి ట్రంప్‌తో డానియెల్‌కు మధ్య శారీరక సంబంధం కుదిరిందని చెప్పారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్న విషయం వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. 
ఇంకో విష‌యం ఏంటంటే ట్రంప్ కు డ్రెస్ లు వేసుకోవ‌డం చేత‌కాద‌ని, పార్టీల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న డ్రెస్ ల‌ను డానియెల్ స‌రి చేసేద‌ని చెప్పాడు. ఇక ఒప్పందం విషయంపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేనని మున్యాన్ ఆ ఛానెల్‌కు చెప్పారు.
 

English Title
Stormy Daniels’ friend describes listening in on the porn star’s phone calls with Donald Trump

MORE FROM AUTHOR

RELATED ARTICLES