యాభైయేళ్ల తరువాత డీఎంకే పార్టీకి కొత్త అధ్యక్షుడు.. నవశఖానికి నాంది..

యాభైయేళ్ల తరువాత డీఎంకే పార్టీకి కొత్త అధ్యక్షుడు.. నవశఖానికి నాంది..
x
Highlights

డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారిలో స్టాలిన్ మూడవ స్థానంలో నిలిచారు....

డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారిలో స్టాలిన్ మూడవ స్థానంలో నిలిచారు. పెరియార్ రామస్వామి నాయర్ తో విభేదించిన అన్నాదురై.. ద్రవిడ మునేట్ర కజగం పార్టీని స్థాపించారు. ఆ తరువాత పార్టీని అధికారంలోకి కూడా తెచ్చారు. అనంతరం అన్నా దురై మృతి చెందారు.దాంతో అయన అనుంగ శిస్యుల్లో ఒకరైన కరుణానిధి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఇక అప్పటినుంచి ఈనెల 5వ తారీకు అనగా 50 ఏళ్లపాటు డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కొనసాగరు. అయితే ఇటీవల అయన మృతి చెందారు. దాంతో అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్‌ ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. స్టాలిన్ తప్ప మిగతా ఎవరు నామినేషన్ వేయలేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్‌ అధికారికంగా ప్రకటించారు. కోశాధికారి పదవికి సీనియర్‌ నేత దురై మురుగన్‌ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినట్టు అయన ప్రకటించారు. డీఎంకే అధ్యక్షుడుగా స్టాలిన్ ఎన్నికవడంతో అయన నివాసం వద్ద కోలాహాలం నెలకొంది.. అయన ఎన్నిక నవశఖానికి నాంది అంటూ నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories