శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం

Submitted by nanireddy on Thu, 10/18/2018 - 06:59
srivari bramotsavam2018

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శిరస్త్రాణాన్ని ధరించిన గోవిందుడు ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుని రీతిలో అశ్వవాహనంపై ఊరేగుతుంటే.. వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం కానున్నాయి... చక్రస్నానం నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేసింది. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలవరకు స్వామివారి ఉత్సవమూర్తులకు. చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.

English Title
srivari bramotsavam2018

MORE FROM AUTHOR

RELATED ARTICLES