అగ్ర‌ద‌ర్శ‌కుడిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో....

Submitted by arun on Thu, 07/12/2018 - 13:58
 Sri ReddyMuruga Das

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది.

హాయ్‌ మురుగదాస్‌ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా...అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌ అంటూ ముగించారు.మరి తనపై చేసిన సంచలన ఆరోపణలకు మురుగదాస్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. 
 ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో...

English Title
srireddy sensational comments murugadas

MORE FROM AUTHOR

RELATED ARTICLES