ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ?

ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ?
x
Highlights

సానుభూతి రావాలని చేశాడా... ఉసురు తీయాలని ప్రయత్నించాడా.. జగన్ అభిమానా..? టీడీపీ అనుచరుడా..? ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ? ఇంతకీ పోలీసులు...

సానుభూతి రావాలని చేశాడా... ఉసురు తీయాలని ప్రయత్నించాడా.. జగన్ అభిమానా..? టీడీపీ అనుచరుడా..? ఏది రియల్ ఫ్లెక్సీ.. ఏది మార్ఫింగ్... ? ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు.. ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.. టీడీపీ మంత్రులు, నేతలు అతను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని అంటుండగా.. వైసీపీ నేతలు మాత్రం అభిమాని అయితే అభిమాన నేతపై దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఇరుపార్టీల నేతలో ఉన్న కొన్ని శ్రీనివాస్ ఫొటోలు వైరల్ అయ్యాయి.

జగన్‌కు శ్రీనివాస్ వీరాభిమాని అని అతను పని చేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్... శ్రీనివాస్ అన్న చెబుతున్నారు.. ఈ ఏడాది న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా తయారు చేయించిన ఫ్లెక్సీ ఫోటో చూపిస్తున్నారు. దానిలో జగన్‌తో పాటు శ్రీనివాసరావు ఫొటోలు ఉన్నాయి. చంటి అనే పేరు ఫ్లెక్సీలో ఉంది. తన తరపున జగన్‌ల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఫ్లెక్సీ ఉంది..

మరోవైపు ఇది వచ్చిన కొన్ని గంటలకే ఫ్లెక్సీ అందులోని మ్యాటర్ ఓకేలా ఉన్నా దానిమీద ఫోటోలు మారాయి టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటోలతో ఉన్న ఫ్లక్సీలు ప్రత్యక్ష మయ్యాయి ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జగన్ అభిమాని అని ఓ వైపు వాదనలు వినిపిస్తుండగా ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫొటోలను చూసిన వైసీపీ అభిమానులు ఇప్పుడేం అంటారని నిలదీస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీనివాస్ వైసీపీ అభిమాని అని.. జగన్ పై సానుభూతి వస్తుందనే దాడికి పాల్పడ్డాడని విశాఖ అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో 10 పేజీల లేఖలో శీనివాస్ రాసుకునట్లు తెలిపారు జగన్‌‌కు సానుభూతి వస్తుందనే దాడి చేసినట్టు వాంగ్మూలంలో తెలిపాడని పేర్కొన్నారు మరోవైపు కావాలని కొందరు ఫ్లెక్సీల మీద సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని తెలిపారు ఇలా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories