శ్రీదేవి వల్లే నా సోదరుడు బతికున్నాడు!

Submitted by arun on Wed, 02/28/2018 - 11:02
man

శ్రీదేవి మరణవార్త వినగానే ఆ అభిమాని గుండె పగిలిపోయింది. వెంటనే ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై బయల్దేరి వచ్చేశాడు అతను. అతని పేరు జతిన్ వాల్మీకి. కళ్లు కనిపించవు. అంధుడు. గత మూడు రోజులుగా శ్రీదేవి నివాసం వద్దే వేచి చూస్తున్నాడు. 

శ్రీదేవి అభిమాని జతిన్ వాల్మీకి ఏఎన్‌ఐతో మాట్లాడారు. ‘నేను అంధుడిని. అందుకే శ్రీదేవిని, ఆమె సినిమాలను చూడలేకపోయాను. కానీ ఆమె మంచితనాన్ని మాత్రం చూశాను. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటిని కలుసుకున్నాను. నా సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని సాయం చేయాలని కోరగా శ్రీదేవి ఏమాత్రం ఆలోచించకుండా రూ.1 లక్ష చెక్ ఇచ్చారు. నటి సాయం తెలుసుకున్న హాస్పిటల్‌ యాజమాన్యం ట్రీట్‌మెంట్ ఫీజులో లక్ష తగ్గించారు. ఆమె కారణంగానే నేడు నా సోదరుడు ప్రాణాలతో ఉన్నాడు. అందుకే ఆ గొప్పవ్యక్తి ఇకలేరని తెలియగానే కడసారి వీడ్కోలు పలికేందుకు యూపీ నుంచి ముంబైకి వచ్చాను. అంతకుమించి నేను ఏం చేయలేనంటూ’  ఆవేదన వ్యక్తం చేశాడు.

English Title
sridevis residence man pay his tributes to her

MORE FROM AUTHOR

RELATED ARTICLES