సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఒకటే

సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఒకటే
x
Highlights

బీబీసీ, సీఎన్ఎన్ వంటి వార్తా సంస్థలు బేనర్ ఐటమ్స్ గా శ్రీదేవి మృతిని ప్రచురించాయి. అంతర్జాతీయంగా శ్రీదేవికి ఉండే ఫేమ్ అది. స్వదేశంలో సామాన్యుల నుంచి...

బీబీసీ, సీఎన్ఎన్ వంటి వార్తా సంస్థలు బేనర్ ఐటమ్స్ గా శ్రీదేవి మృతిని ప్రచురించాయి. అంతర్జాతీయంగా శ్రీదేవికి ఉండే ఫేమ్ అది. స్వదేశంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతో మంది ఆమెకు వీరాభిమానులు. అందుకే దుబాయిలో హఠాత్తుగా మృతిచెందిన శ్రీదేవిని భారత్ కు రప్పించేందుకు పెద్దపెద్దవాళ్లే రంగంలోకి దిగారు. కానీ ఫలితం శూన్యం. కారణం దుబాయ్ రూల్స్.

శనివారం అర్ధరాత్రి దుబాయ్ లో మృతిచెందిన శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. వేలాదిమంది అభిమానులు ఆమె ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కానీ శ్రీదేవి మృతదేహం దుబాయ్ నుంచి భారత్ చేరడానికి సమయం పడుతూనే ఉంది. సెలబ్రిటీకైనా, సామాన్యుడికైనా ఒకేలా పాటించే దుబాయ్ రూల్సే ఈ ఆలస్యానికి కారణం.

శ్రీదేవి పార్థివ దేహాన్ని సత్వరమే పంపించాలంటూ భారత్‌లోని అత్యున్నత స్థాయి వర్గాలు దుబాయ్‌ అధికార వర్గాలకు ఫోన్ల మీద ఫోన్లు చేశాయి! పలువురు పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. కానీఅక్కడి చట్టాలు.. విదేశీ ఎంబసీలు, ప్రభుత్వాల ప్రభావంతో పని చేయవు. నిబంధనల ప్రకారమే పని చేస్తాయి. శ్రీదేవి విషయంలో ఇది మరోసారి రుజువైంది.

దుబాయ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు తరలించే వందలాది మృతదేహాలను అల్‌ ఖుసే్‌సలోని పోలీసు మార్చురీలోనే భద్రపరుస్తారు. సెలబ్రిటీ అయినా శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా అక్కడే భద్రపరిచారు. ఫోరెన్సిక్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తామని అక్కడి పోలీసులు తేల్చి చెప్పారు.

పోస్టుమార్టం, ఇతర వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికే కార్యాలయ పని వేళలు ముగిశాయి. దాంతో, పరీక్ష నివేదికలను పూర్తిగా అధ్యయనం చేయనిదే తుది నివేదికను జారీ చేయలేనని వాటిని నిర్వహించిన డాక్టర్‌ ఖాలీద్‌ అల్‌ అబురైఖీ స్పష్టం చేశారు. డాక్టర్ల నివేదిక రాకుండా మృతదేహాన్ని తాము అప్పగించలేమని పోలీసులు చెప్పారు.

సోమవారం ఉదయం వైద్య నివేదికలు అందిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని, ఆ తర్వాతే పోలీసు క్లియరెన్స్‌ లభిస్తుందని తెలుస్తోంది. అనంతరం దుబాయిలోని భారతీయ కాన్సులేటు శ్రీదేవి పాస్‌ పోర్టును రద్దు చేసి మరణ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఆమె మృతదేహన్ని భారత్‌కు తీసుకెళ్లడానికి ఎన్‌వోసీ జారీ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories