శ్రీదేవి నగీనా గా “న భూతొ న భవిష్యతి”

Submitted by arun on Wed, 10/24/2018 - 16:44
sd

నటిగా  శ్రీదేవి నటనకి మన దేశంలో ఎంతోమంది... ముగ్ధులు అయిపోతారు... అలా అందరికి నచ్చే సినిమా.. నగీనా. ఇది  1986లో విడుదలైన భారతీయ ఫాంటసీ నిండిన హింది సినిమా. ఈ చిత్రాన్ని హర్మేష్ మల్హోత్రా నిర్మించి దర్శకత్వం వహించాడు. దీనికి జగ్‌మోహన్ కపూర్ కథను అందించగా, రవి కపూర్ స్క్రీన్‌ప్లే వ్రాశాడు. దీనిలో శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ రజని అనే ఒక నాగకన్య ఒక మానవున్ని పెళ్ళి చేసుకుని తన జతగాడిని చంపిన దుష్ట మాంత్రికునిపై ప్రతీకారం తీర్చుకొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఇంకా రిషి కపూర్, అమ్రిష్ పురి, సుష్మ సేథ్, ప్రేం చోప్రాలు నటించారు. ఈ సినిమా విడుదల కాగానే విజయవంతమయ్యింది. 1986లో విడుదలైన హిందీ సినిమాలలో ఎక్కువ వసూళ్లు చేసిన రెండవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా స్త్రీ ప్రధాన సినిమా అయినప్పటికీ వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ సినిమాకు 1989లో తరువాయిగా నిగాహే: నగీనా పార్ట్ -2 విడుదలయ్యింది. భారతదేశంలో ఒక సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మొట్టమొదటి సినిమా అది. అయితే అది వాణిజ్యపరంగా తుడిచి పెట్టుకుపోయింది. ఈ సినిమా తెలుగులో "నాగిని"గా డబ్ చేయబడింది. ఈ సినిమాలోని డైలాగులు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. ఇది హిందీలో పాములతో తీసిన సినిమాలలో ఉత్తమ పది సినిమాలలో ఒకటిగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. శ్రీదేవి చేసిన క్లైమాక్స్ నృత్యం "మై తేరీ దుష్మన్" బాలీవుడ్ సినిమాలలోని "సర్పనృత్యాల"లో ఉత్తమమైనదిగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని శ్రీదేవి నటనకు 2013లో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక బహుమతి లభించింది. మీరు శ్రీదేవి నటనని ఇష్టపడితే మాత్రం తప్పక చూడాల్సిన సినిమా నగీన.  శ్రీ.కో.

English Title
sridevi nagina movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES