ప్లాస్టిక్ స‌ర్జరీలే శ్రీదేవి ప్రాణం తీశాయా..?

Submitted by arun on Mon, 02/26/2018 - 11:42
Sridevi

శ్రీదేవి మరణానికి గుండెపోటే కారణమా ? ఆమె కుప్పకూలడానికి సౌందర్య చికిత్సలూ కారణమయ్యాయా ? చెక్కుచెదరని అందంతో ప్రేక్షకుల్ని అలరించాలనే తపనే అనేక మంది తారల్ని మృత్యుముఖంలోకి తీసుకువెళ్తోందా...? 54 ఏళ్ల వయసులోనే ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూయడంతో...ఈ వాదనకు మరింత ఊతమిచ్చింది. 

సొగసైన ముక్కు కోసం శ్రీదేవి, సన్నగా నాజూగ్గా కనిపించడానికి కరీనా కపూర్‌, అపురూపమైన పెదవుల కోసం అనుష్కశర్మ... ఇలా ఒక్కొక్కరు సినీ పరిశ్రమ అంచనాలను చేరుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ప్రేక్షకుల్ని అలరించడానికి, మార్కెట్లో తమ ఇమేజ్‌ తగ్గిపోకుండా కాపాడుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. అమాంతంగా బరువు తగ్గిపోవడం, అనవసరంగా చికిత్సలు చేయించుకోవడంతో వారి ప్రాణాలకే ప్రమాదం తెస్తున్నాయ్. 

ఆహారం విషయంలో శ్రీదేవి చాలా జాగ్రత్తగా ఉండేది. యాభై ఏళ్లు దాటినా చలాకీగా, చురుగ్గా, ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో కనిపించిందంటే కారణం ఆహారపు అలవాట్లే. శ్రీదేవి పూర్తిగా శాకాహారి. చిరుతిళ్లకి దూరం. కనీసం శీతల పానీయాలు కూడా స్వీకరించేది కాదు. రోజూ వ్యాయామం చేసినా కుమార్తెలతో కలసి ఆటాపాటలతో చిందులేసేది. ఆహార్యంలోనే కాదు వ్యక్తిత్వంలోనూ శ్రీదేవి అందాల రాశే. దక్షిణాదిలో, బాలీవుడ్‌లోనూ అగ్ర తారలతో కలసి పనిచేసింది.

అందానికి చిరునామాగా నిలిచిన శ్రీదేవి వయసు పెరుగుతున్నకొద్దీ మరింత అందంగా కనిపించేందుకు తాపత్రయపడేవారు. 50 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తున్నారంటే కారణం శ్రీదేవి చేయించుకున్న సర్జరీలే. తన అందం విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. బ్యూటీ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా వెళ్లేవారు. ఇటీవల లిప్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆమె ముఖంలో మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీదేవి లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ కరెక్షన్, బోటాక్స్ అండ్ ఆక్సీ పీల్, ఫేస్ లిప్ట్ అప్స్, బాడీ టకింగ్ మొదలైన చికిత్సలు చేయించుకున్నారు.

అంతేకాదు వెయిట్‌ పెరగకుండా ఆకలి కాకుండా ఉండేందుకు శ్రీదేవి మందులు తీసుకునే వారు. అందాన్ని కాపాడుకునేందుకు తీసుకున్న మందులు, చేయించుకున్న సర్జరీలే శ్రీదేవి చావుకు కారణమయ్యాయని అభిమానులు, సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. 

English Title
sridevi may die with plastic surgery

MORE FROM AUTHOR

RELATED ARTICLES